పేజీలు

  • సంతోష్
  • ఆసక్తికరమైన విషయాలు
  • వెబ్ సైట్స్
  • జోక్స్
  • కవితలు
  • ప్రేమ చిట్కాలు
  • Santhosh

సంతోష్ కుమార్

నా గురించి

సంతోష్ కుమార్
నల్గొండ, ఆంధ్ర ప్రదేశ్, India
నా పేరు సంతోష్ సంతోష్ కుమార్. నేను ట్రిపుల్ ఐటి బాసర లో చదువుకుంటున్నాను. మా నాన్న పేరు మల్లయ్య మరియు మా అమ్మ పేరు సుజాత .మా నాన్న రైతు మా అమ్మ వర్కర్. నాకు మా కుటుంబము అంటే చాలా ఇష్టం. నాకు శంకర్ అనే తమ్ముడు మరియు రేణుక అనే చెళ్లి వున్నది నాకు మా చెళ్లి అంటే చాల ఇష్టం.
View my complete profile

కవితలు



















నా తెలుగు కవితలకు స్వాగతం

************నా కవితలు************

అమ్మ ప్రేమ :

కలకాలం తన ప్రేమ మనకి
ఎల్లకాలం మన వృద్ది తనకి

తను రచించాలి మన జన్మని
మనం రుచించాలి తన ప్రేమని
జీవం ఇచ్చే దైవం అమ్మ
ప్రాణం పోసే గుణం అమ్మ
దీపం కూర్చే రూపం అమ్మ

చదువు మీద కవిత :
విద్య ఓ వరం
ఎందరికో జీవనాధారం
తెగిన జీవితాలకి ఆధారం
విద్య ఓ శిఖరం
అందరికీ అందనంత దూరం
అందితే అంత గొప్ప సత్కారం
విద్య ఓ భాస్కరం
ఆరాధించాలి అందరం
అభ్యసించాలి నిరంతరం
విద్య ఓ గౌరవం
ఙానానికి జీవం
సమాజానికి దైవం

విద్య ఓ ఉషస్సు
పెంచును తేజస్సు
తొలగించును తమస్సు

స్నేహం (ఇది చాలా గొప్పది) :

నిర్జీనమైన శిశిరంలో తొలకరి జల్లు కురిపించి
వికసించిన పువ్వులను తెచ్చునది వసంతం
అణగారిన జీవితాన అమృతమైన ప్రేమని
కురిపించి జీవితంలో హరివిల్లు తెచ్చునది స్నేహం

గెలుపన్నది నీ లక్ష్యం - చేసేయి దానికి యుద్దం
ఓటమన్నది సహజం - తలవంచక దూసుకుపో నేస్తం
పదే పదే ప్రయత్నించు - పట్టువదలక శ్రమించు
ఆకాశానికి నిచ్చెనవేయి - అందినంత పనిచేయి
అనువైన సాయంచేయి - ఆపదలో రక్షించేయి
పట్టువిడుపు అసలు వద్దందాం
పట్టుదలే గెలుపుకి మూలమందాం.


1.జగతి లోనే తియ్యని పదం అమ్మ
అమ్మ లేకున్న ఎక్కడిది ఈ జన్మ
అమ్మే మన అత్మకు పరమాత్మ
అమ్మ ప్రేమ పొంది సార్ధకమైనది నా జన్మ.


2.నవమాసాలు కని పెంచింది నన్ను నా తల్లి
నా తల్లికి సాటి రాదు ఏ జాబిల్లి
మరుజన్మ అంటు ఉంటే పుడతాఅను నా తల్లికి మళ్లీ
భగవంతుని ప్రార్ధిస్తాను నా తల్లికి పుట్టించమని మళ్లీ మళ్లీ



నువ్వే నా కల
నన్ను వెంటడే అల
నీ చూపులతో వేశావు
నా హృదయానికి వల

******
నింగి నేల
నీ రూపం
నువ్వే కదా నాకు
ఈ లోకం

******

కాళిదాసు కలం నుండి జాలువారిన ఏ కావ్యానివో నువ్వు.
నా కనుల చివర నిలిచిన కన్నీటి ముత్యాణివో నువ్వు.
మేఘం అంచున దాగిన తొలిచిరు చినుకువో నువు.
నా హృదయంలో స్వప్నమై అల్లరిచెస్తున్నావు.

******

సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతంలా...
చంద్రుడు కనిపించేవేల వెనుగానంలా....
మల్లెలు వికసించేవేల సుగంధంలా...
నా మనస్సు స్పందించే వేల మనోగేతంలా ...
ఎందుకు నా మదిలో ఇంత అలజడి రేపుతున్నావు......?

******

బాల్యంలో
బడిలోనో, అరుగుపైనో
అక్షరాలు దిద్దినప్పటి నేస్తం
పట్టిసీమ శివరాత్రి తిరునాళ్ళలో
తప్పిపోయిన 'బిక్కి' బక్కపిల్ల … నా కవిత్వం
******

చలిరాత్రుల్లో గువ్వపిల్లలా ముడుచుకొని
వెచ్చదనపు మంగవడిలో
రాకుమారుల సాహసాలకు ఊకొట్టిన కథల సవ్వడి … నా కవిత్వం
వెలుగుల్లేని వాడల్లోకి
కాలినడకన గడప గడపను దర్శించి
మండే చితుకుల వెలుగుల్లో
అక్షరాలను, వాక్యాలను
వెదజల్లిన బోధకురాలు రత్నమ్మ బైబిలుసంచి … నా కవిత్వం
******

నవరాత్రుల సంబరాల్లో తడిపొడి చిందుల్లో
ఉర్రూతల కేరింతల చిందేయించిన
వీరాస్వామి డప్పు వాద్య చిర్రా చిటికిన పుల్లా … నా కవిత్వం
******

సుబ్రమన్యుని తిరునాళ్ళలో
గమ్మత్తైన లాజిక్కుతోఒకటికి మూడంటూ బొమ్మలజూదం
కనికట్టో మేజిక్కో
పాములనో మనుషులనో ఆడించి విసిరే మంత్రించిన తాయత్తు … నా కవిత్వం
******

సంవత్సరాంత పరీక్షలకోసం
క్వార్టర్ నంబరు ఐదు వాకిట్లో
పెద్దలాంతరో, పెట్రొమాక్సు లైటో వెదజల్లే కాంతికి
చేరినపిల్లల చదువుల కోలాహలం ... నా కవిత్వం
******

హైస్కూల్లో ఎదుగుతున్న పడచుల
పేమలేఖల పరిమళాలు
ఫుట్బాలులు, కబడ్డీలు, వాలీబాలులు
పోటిలతో సీనియర్స్
స్పూర్తి నిచ్చే చెమటచుక్కలు ... నా కవిత్వం
******

గోదారి ఈతలు
అలల గలగలలు
జాలరివలలు
ఇసుకతెన్నెల పరుగులు,
నిర్ణీత సమయ సాకేంతాల ప్రేమజంటలు
వేళను గోధూళిని చేసే పశువులు
చూస్తూ చూస్తూనే జారిపోతున్న పొద్దులో
భానుథియేటర్ నుండి వినిపించే
ప్రార్థనా గీతపు గ్రామఫోబు రికార్డు ... నా కవిత్వం
******

తవ్వుకుంటున్న చెలమల్లో
చెలి అస్పష్ట ప్రతిబింబం .. నా కవిత్వం



******
friendship

Perfect friendship, is the friendship of men who are good, and alike in virtue;
And such a friendship is as might be expected permanent, since there meet in it all the qualities that friends should have.

Love and friendship therefore are found most and in their best form between such men. But it is natural that such friendships should be infrequent; for such men are rare. Further, such friendship requires time and familiarity; as the proverb says,men cannot know each other till they have 'eaten salt together'‑ nor can they admit each other to friendship or be friends till each has been found Iovable and been trusted by each. Those who quickly show the marks of friendship to each other wish to be friends, but are not friends unIess they both are Iovable and know the fact; for a wish for friendship may arise quickly, but friendship does not.

**************************************************


THANK'S FOR Visiting my Blog



************************************************

Home
Subscribe to: Posts (Atom)



సంతోష్ కుమార్. Powered by Blogger.
Credit: DryIcons.